తమిళనాడు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసేందుకు విభిన్న పద్ధతిని ఎంచుకున్నారు.
శుక్రవారం ఉదయం తన నివాసం ముందు చొక్కా విప్పి, కొరడాతో ఆరు సార్లు స్వయంగా తనను కొట్టుకున్నారు. ఈ చర్యపై ఆయన “డీఎంకే ప్రభుత్వం మహిళల భద్రతలో విఫలమైందని” తీవ్ర ఆరోపణలు చేశారు.
అన్నామలై ఈ నిరసన చర్యను అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనకు స్పందనగా చేపట్టినట్లు తెలిపారు.
లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు డీఎంకే కార్యకర్త అని ఆరోపించిన ఆయన, ప్రభుత్వం న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తన నిరసనలో భాగంగా 48 రోజుల నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.
ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. బీజేపీ శ్రేణులు ఆయనకు మద్దతు తెలుపుతుండగా, డీఎంకే శ్రేణులు ఈ చర్యను విమర్శించాయి.
అన్నామలై చర్య రాజకీయ ఉత్కంఠను పెంచుతుండగా, డీఎంకే ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.