టాలీవుడ్‌లో అత్యంత రిప్యూటెడ్ నిర్మాణ సంస్థల్లో అన్నపూర్ణ స్టూడియోస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. భారీ స్థాయిలో నిర్మాణాలు, స్టూడియో ఫెసిలిటీతో పాటు నటి నటుల నుంచి టెక్నీషియన్ల వరకు అనేకమంది కెరీర్ ప్రారంభించిన ప్రాచుర్యం ఈ సంస్థ సొంతం.
అయితే ఇటీవల వారి పేరు మీద ఫేక్ జాబ్ ఆఫర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వారు అధికారికంగా స్పందించారు.
తమ సంస్థ పేరుతో నటీనటులు, టెక్నీషియన్లకు ఉద్యోగ అవకాశాలంటూ తప్పుడు ప్రకటనలు వైరల్ అవుతున్నాయని, అలాంటి వాటిని ఎవరూ నమ్మకూడదని హెచ్చరించారు. అన్నపూర్ణ స్టూడియోస్ తరపున ఎప్పుడూ డబ్బులు తీసుకునే విధానమే లేదని స్పష్టంచేశారు.
“ఆడిషన్స్, ఇంటర్వ్యూల కోసం ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు” అని సంస్థ క్లారిటీ ఇచ్చింది. అలాగే, ఎవరికైనా అనుమానాస్పద మెసేజ్‌లు, ఇమెయిల్స్ వస్తే, వెంటనే తమ అధికారిక మెయిల్‌కు ఫార్వర్డ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిలింలో అవకాశాల పేరుతో మోసాలు జరగకుండా తాము జాగ్రత్తలు తీసుకుంటామని సంస్థ తెలిపింది.
ఇలాంటి సందర్భాల్లో ఫేక్ న్యూస్‌కు బలి కాకుండా అధికారికంగా వస్తున్న సమాచారం ద్వారానే నమ్మకాన్ని కలిగించుకోవాలంటూ, సినీ ప్రముఖులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.