టాలీవుడ్: బాలీవుడ్ లో స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాస్ మరియు స్పోర్ట్స్ స్టార్స్ బియోపిక్స్ ఎక్కువగా రూపొందుతాయి. ఈ మధ్య తెలుగులో కూడా ఈ సినిమాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బాక్సింగ్ నేపధ్యం లో ఇద్దరు తెలుగు హీరోల సినిమాలు రూపొందుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా ‘లైగర్’ అనే సినిమా మరియు కిరణ్ అనే కొత్త దర్శకుడి తో వరుణ్ తేజ్ ‘గని’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు బాక్సింగ్ క్రీడా నేపధ్యం లో రూపొందుతున్నవే. ఇవి దాదాపు షూటింగ్ చివరి స్టేజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ లిస్ట్ లోకి మరో సినిమా వచ్చి చేరింది.
ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా పరిచయం అయిన నటుడు సుశాంత్ రెడ్డి, తర్వాత బొంబాట్ అనే సినిమాలో ఓటీటీ లో పలకరించాడు కానీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యం లో ఒక సినిమా సుశాంత్ హీరో గా రూపొందనున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేసారు. ఈ సినిమాని తరుణ్ భాస్కర్ నిర్మాణంలో రూపొందనుంది. ఈ వీడియో లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ రౌడీయిజం చేసే పాత్ర ఫీలింగ్ కలిగించారు మేకర్స్. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ సమర్పణలో ప్రమోద్ రాజు, నాగరాజు ఈ సినిమాని నిర్మించనున్నారు. రోహిత్ తంజావూర్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నట్టు వీడియో చివర్లో ప్రకటించారు.