మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మరోసారి అఖండ 2 కోసం కలసి పనిచేస్తున్నారు.
మొదటి భాగం సృష్టించిన బాక్సాఫీస్ రికార్డులు, బాలయ్యను మాస్ హీరోగా మరింత పటిష్టం చేశాయి.
ఇప్పుడు అఖండ 2 మరింత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రారంభ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి.
బోయపాటి శ్రీను తన మార్క్ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమాను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా ఉండేలా మేకర్స్ కృషి చేస్తున్నారు.
బాలయ్యతో నాలుగోసారి కలిసి పనిచేయడం బోయపాటికి కూడా ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి.
ఇక తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో సమ్యుక్త కీలక పాత్రలో నటించనుంది.
“భీమ్లా నాయక్,” “విరూపాక్ష” వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంయుక్త, ఇప్పుడు అఖండ 2లో ప్రధాన పాత్రలో కనిపించబోతుంది.
కథనాయకుడు బాలయ్యతో సమ్యుక్త కాంబినేషన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
థమన్ సంగీతం, బోయపాటి స్టైల్ యాక్షన్, సంయుక్త ప్రత్యేక పాత్రతో అఖండ 2పై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతుండగా, బాలయ్య అభిమానులకు ఇది నిజంగా ఓ పండుగలా మారనుంది.
మరి ఈ భారీ అంచనాలు ఏ స్థాయిలో నెరవేరుతాయో చూడాలి!