మూవీడెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కథల ఎంపికలో తాజాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు.
జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ కొట్టే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, గతంలో శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన “సైంధవ్” మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఆ సినిమా పూర్తిగా సీరియస్ కాన్సెప్ట్‌తో ఉండటమే దానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అభిమానులు వెంకటేష్ నుంచి వినోద ప్రధానమైన కథల్ని ఆశిస్తున్నారు.
అందుకే ఆయన యువ దర్శకులతో కథల చర్చలు కొనసాగిస్తున్నారు.
తాజాగా “డీజే టిల్లు” ఫేమ్ విమల్ కృష్ణ చెప్పిన కథకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
విమల్ కృష్ణ, ఓ ఆసక్తికరమైన కామెడీ కథను సిద్ధం చేశారని సమాచారం. “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
విమల్ కృష్ణ “డీజే టిల్లు”తో తక్కువ సమయంలో తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు.
ఇప్పుడు వెంకటేష్ కోసం డిజైన్ చేసిన కథలో వినోదం, ఎమోషన్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.