మూవీడెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘దేవర’తో పాన్ ఇండియా రేంజ్‌లో కమర్షియల్ హిట్ సాధించిన ఎన్టీఆర్, ప్రస్తుతం ‘వార్ 2’లో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నారు.
ఆ ప్రాజెక్ట్ తర్వాత ప్రశాంత్ నీల్‌తో భారీ బడ్జెట్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీగా పెట్టుబడి పెడుతోంది. 2025 జనవరిలో తారక్ షూటింగ్‌లో జాయిన్ అవుతారని టాక్.
ఈ సినిమాలో ప్రధాన పాత్రకు ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ను తీసుకునే అవకాశం ఉంది.
అలాగే, మరో ప్రముఖ హీరో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
సపోర్టింగ్ రోల్ అయినా ఈ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో, ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది.
ప్రశాంత్ నీల్ మాఫియా ప్రపంచంలోని నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించినట్లు సమాచారం.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2026 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.