మూవీడెస్క్: బలగం సినిమా ద్వారా దర్శకుడిగా మారిన వేణు తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు, ఎవరితో ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎల్లమ్మ అనే టైటిల్ తో వేణు నేచురల్ స్టార్ నాని తో సినిమా చేయనున్నట్లు వార్తలు బయటకు వచ్చినా, ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ అయ్యిందనే క్లారిటీ వచ్చింది.
ఇప్పటివరకు బలగం తర్వాత వేణు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడం ఖాయమని స్పష్టత వచ్చినా, కథానాయకుడిగా నాని కాకుండా మరో హీరో ఉంటాడని తెలుస్తోంది.
తాజాగా ఈ ప్రాజెక్ట్ కోసం యంగ్ హీరో నితిన్ ని ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయనే సమాచారం.
దిల్ రాజు, నితిన్ కాంబినేషన్ లో ఇప్పటికే పలు హిట్లు ఉన్నందున, ఈసారి కూడా మంచి ప్రాజెక్ట్ ఉండబోతుందని అందరూ భావిస్తున్నారు.
ప్రస్తుతం నితిన్ తన తాజా ప్రాజెక్ట్ ‘తమ్ముడు’తో బిజీగా ఉన్నాడు. అలాగే ‘రాబిన్ హుడ్’ అనే మరో ప్రాజెక్ట్ కూడా డిసెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ రెండు సినిమాల తర్వాత, ‘ఎల్లమ్మ’ మూవీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కథ పెద్ద బడ్జెట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ నితిన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, వేణు తన రెండో సినిమాతోనూ మరో సక్సెస్ అందుకునే అవకాశాలు బాగానే ఉన్నాయనే మాట వినిపిస్తోంది.