హైదరాబాద్: కరోనా వల్ల, లాక్ డౌన్ ఎత్తివేసిన కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడప్పుడే థియేటర్స్ తెరచుకుని వీలు లేకపోవడం తో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాల్ని ఒక్కొక్కటిగా ఆన్లైన్ ప్లాటుఫార్మ్స్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వారమే రిలీజ్ ఐన పెంగ్విన్ బాట లోనే విలక్షణ నటుడు సత్యదేవ్ నటించిన 47 రోజులు సినిమా జూన్ 30న Zee5 లో విడుదల చేయడానికి రంగం సిద్ధం ఐంది. ఈరోజే ఈ సినిమా ట్రైలర్ ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు.
ఒక ఆక్సిడెంటల్ గా జరిగింది అనుకునే హత్యని ఛేదించే పోలీస్ ఆఫీసర్ గా సత్యదేవ్ నటిస్తున్నారు. సత్య ఇన్వెస్టిగేట్ చేసే హత్య కి తన భార్య మిస్టీరియస్ కి మర్డర్ కి సంబంధం ఉన్నదా అన్న కోణం లో ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు ట్రైలర్ ద్వారా చెప్పదలచుకున్నారు. మిస్టీరియస్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ క్యాటగిరీ లో ఇప్పటికి చాలా సినిమాలే వచ్చినా ఈ సినిమా అందులో మంచి స్థాయి కి చేరుకుంటుందో లేదో అని జూన్ 30 వారికి వేచి చూడాల్సిందే.సత్యదేవ్ కి జంటగా ద్వారక ఫేమ్ పూజ ఝవేరి నటిస్తుంది, రఘు కుంచె ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.
పెంగ్విన్ సినిమా ఫలితం ఆశాజనకంగా లేకపోయినా మెల్లిగా ఒక్కొక్క సినిమా డిజిటల్ ప్లాట్ఫారం బాట పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇంకా చాలా సినిమాలు ఓటీటీ బాటలోనే వెళ్లనున్నట్టు సమాచారం.