మొదటి సినిమా తోనే విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తోనే పాటు కమర్షియల్ సక్సెస్ కూడా అందుకున్న డైరెక్టర్ ‘వెంకటేష్ మహా’. కేరాఫ్ కంచరపాలెం తో మానవ సంబధాలపైన సబ్జెక్టు ఎంచుకుని అందరికి నచ్చేలా తీసి మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు రెండవ చిత్రంగా మలయాళం లో ఫాహద్ ఫాసిల్ నటించిన ‘మహేషింటా ప్రతీకారం’ అనే సినిమాని ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ అనే టైటిల్ తో రూపొందించారు. ఈ సినిమాలో విలక్షణ నటుడు సత్యదేవ్ హీరో గా నటించారు. బాహుబలి సినిమాని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ వారు ఈ సినిమాని నిర్మించారు.
ముందుగా అనుకున్నట్టు సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల ఆలస్యం అయింది. కానీ ఇప్పుడప్పుడే థియేటర్లు తెరచుకుననే వీలు లేకపోవడంతో ఈ సినిమాని ప్రొడ్యూసర్స్ డిజిటల్ లో అందుబాటులో ఉంచుతున్నారు. జులై 15 నుండి ఈ సినిమా ‘నెట్ఫ్లిక్‘ లో విడుదల అవబోతోంది. ఇప్పటికే సత్యదేవ్ నటించిన ’47 డేస్’ అనే సినిమా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అయి మిశ్రమ స్పందనతో నడుస్తుంది. ఇలా చూస్తుంటే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అయ్యే సినిమాలకి ఇది ఆరంభం లాగ అనిపిస్తుంది. కరోనా కి వాక్సిన్ ఆలస్యం అయ్యే కొద్దీ ఇంకా చాలా సినిమాలు డిజిటల్ రిలీజ్ కి క్యూ కట్టేట్టు ఉన్నాయి.