ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం అందరూ వెబ్ సిరీస్లు తీస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్స్ మూత పడడంతో వీటి ప్రవాహం కూడా డిజిటల్ మార్కెట్ లో ఎక్కువ అయింది. ఒకప్పుడు ఇంగ్లీష్ నొవెల్స్ ని సినిమాలు, సిరీస్ లు తియ్యడం జరిగింది. హిందీ లో కూడా ఈ మధ్యనే నొవెల్స్ ని సినిమాలు తీసే ట్రెండ్ మొదలైంది. దాదాపు చేతన్ భగత్ పుస్తకాలన్నీ సినిమాలుగా వచ్చాయి. ఇపుడు తెలుగులో కూడా ఈ ట్రెండ్ మొదలైంది. ఈ మధ్యనే మధుబాబు రచించిన షాడో నవలల్ని వెబ్ సిరీస్ గ మలిచే ఏర్పాట్లలో AK ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన అనిల్ సుంకర ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి బాటలోనే ఇపుడు ‘శప్తభూమి’ అనే నవల కూడా వెబ్ సిరీస్ గా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శప్తభూమి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. రాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు. అప్పటి జీవితము చిత్రించిన చారిత్రాత్మక నవల. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారం శప్తభూమి. ఈ నవలలోని చారిత్రక పాత్రలను సమీక్షించుకుంటున్నప్పుడు ఎక్కువమంది అణగారిన వర్గాల వారే అయి ఫున్నారన్న సంగతి తెలిసివచ్చింది. వారు దళిత బహుజన కులాలవారే ఈ విషయం గుర్తించిన తర్వాత రాయలసీమ చారిత్రక నవల కాస్తా, రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా రూపం తీసుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా, చారిత్రక కథ నుండి చారిత్రక నవలకూ, చారిత్రక నవల నుండి దళిత బహుజన చారిత్రక నవలకూ ప్రయాణించిన ఆలోచన క్రమం కూడా ఈ నవలా రచన వెనుక పనిచేసింది.
ఈ నవల 2019 లో కేంద్రీయ సాహిత్య అవార్డు కూడా గెల్చుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇంతకముందు చాలా సినిమాలు తెలుగు నవలల ఆధారంగా తీశారు.ఇంకా మున్ముందు వీరి బాటలో చాలా నవలలు సినిమాలు లేదా సిరీస్ లుగా మారే అవకాశం ఉంది.