కోలీవుడ్: లాక్ డౌన్ సమయం లో థియేటర్లు మూతపడిన తర్వాత ఎందరో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమం లో పెద్ద పెద్ద స్టార్స్, డైరెక్టర్స్ కూడా ఓటీటీల్లో కొత్త కంటెంట్ తో అలరించే ప్రయత్నం చేసారు. ఇందులో భాగంగా మన దగ్గర కూడా ఆంథాలజీ సిరీస్లు మొదలయ్యాయి. తమిళ్ లో ఇదివరకే ‘పుత్తం పుదు కలై’ అనే ఒక ఆంథాలజీ సిరీస్ రూపొంది మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సిరీస్ 5 గురు డైరెక్టర్లు కలిసి 5 కథలతో రూపొందించారు. ఇపుడు ‘పావ కధైగల్’ అనే మరో ఆంథాలజీ సిరీస్ తమిళ్ లో రూపొందింది. ఆర్ఎస్విపి మూవీస్ మరియు ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ఈ సిరీస్ నిర్మించబడింది
గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెట్రి మారన్, సుధా కొంగర, విఘ్నేశ్ శివన్ నలుగురు డైరెక్టర్స్ కలిసి ఈ ఆంథాలజీ సిరీస్ ని డైరెక్ట్ చేసారు. ఈ సిరీస్ నెట్ఫ్లిక్ లో విడుదల అవబోతుంది. ఈ సిరీస్ కి సంబందించిన టీజర్ నిన్న విడుదల చేసారు. టీజర్ ఆద్యంతం మానవ సంబంధాలు, పరువు, ప్రేమ, గౌరవం లాంటి అంశాల పైన ఫోకస్ చేసారు. ఈ సిరీస్ లో కాళిదాసు, గౌతమ్ మీనన్ , సాయిపల్లవి, సిమ్రాన్ , ప్రకాశ్ రాజ్, జయరాం, కల్కి కొచ్లిన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 18 నుండి ఈ సిరీస్ నెట్ఫ్లిక్ ఓటీటీ లో అందుబాటులో ఉండబోతుంది.