కోలీవుడ్: తెలుగులో ఇపుడే ‘పిట్ట కథలు’ అనే అంథాలజీ సిరీస్ రూపొందింది. తమిళ్ లో ఇప్పటికే ‘పుత్తం పుడు కలై’ మరియు ‘పావ కడైగల్’ అనే అంథాలజీ సిరీస్ లు రూపొంది సూపర్ హిట్ సాధించాయి. ఇపుడు తమిళ్ లో మరో అంథాలజీ సిరీస్ రూపొందింది. ఇందులో నాలుగు కథలకి నలుగురు దర్శకులు దర్శకత్వం చేయనున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ , వెంకట్ ప్రభు, నలన్ కుమారస్వామి ఈ సిరీస్ ని రూపొందించారు.
ఇందులో గౌతమ్ మీనన్ దర్శకత్వం తో పాటు తన స్టోరీ లో నటిస్తున్నాడు. తాను మొదటి సారి దర్శకత్వం వహించిన ‘చెలి’ సినిమా ఈ మధ్యనే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ డైరెక్షన్ తో పాటు ఆక్టర్ గా కూడా ఫుల్ బిజీ అయ్యాడు. శింబు నటించనున్న ఒక సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
వేల్స్ ఫిలిమ్స్ ఇంటెర్నేషనల్ బ్యానర్ పై ఇషారి.కే.గణేష్ ఈ సిరీస్ ని రూపొందించారు. ఈ సిరీస్ లో అమలా పాల్, విజయ్ సేతుపతి, మేఘా ఆకాష్, అమితాష్, వరుణ్, సాక్షి అగర్వాల్, అదితి బాలన్ నటిస్తున్నారు. ఈ ఫిలిం ని ఫిబ్రవని 12 న విడుదల చేయనున్నట్టు ఒక పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు.