టాలీవుడ్: RX100 డైరెక్టర్ ద్వారా సక్సెస్ సాధించి కొంచెం టైం తీసుకుని తరువాతి ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నాడు డైరెక్టర్ ‘అజయ్ భూపతి’. తన రెండవ సినిమాగా ‘మహా సముద్రం’ అనే మల్టీ స్టారర్ తియ్యబోతున్నాడన్న విషయం తెలిసిందే. ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్, అలాగే చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నాడు. ఇందులో ఒక హీరోయిన్ గా ఇదివరకే అదితి రావు హైదరి ని ఎంపిక చేసారు.
ఇపుడు మరొక హీరోయిన్ గా ‘అను ఇమ్మానుయేల్‘ ని ఎంచుకున్నారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత అను ఇమ్మానుయేల్ కూడా మరే సినిమా కూడా చెయ్యలేదు. తెలుగులో పెద్ద హీరోలతో తో కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆశించినంత విజయం ఐతే ఈ హీరోయిన్ కి అందలేదు. ఈ సినిమా ద్వారా అయినా విజయం సాధించాలని ఎదురుచూస్తుంది. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రామబ్రహ్మం సుంకర సమర్పిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. ఈ సినిమా ద్వారా చాలా మంది ప్లాప్ ల నుండి బయటపడి తమ పూర్వ వైభవం పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.