fbpx
Monday, April 14, 2025
HomeMovie Newsడైరెక్టర్ అవుతానంటున్న హీరోయిన్

డైరెక్టర్ అవుతానంటున్న హీరోయిన్

AnupamaPrameshwaran PlanningFor Direction

మాలీవుడ్: మలయాళం ‘ప్రేమమ్’ సినిమా ద్వారా సినిమాలు ప్రారంభించిన ‘అనుపమ పరమేశ్వరన్‘ మలయాళం లో ఇప్పటికే రెండంటే రెండే సినిమాలు చేసింది. తన మూడవ సినిమాగా ‘మణియారాయిలే అశోకన్‌’ అనే మలయాళం సినిమాలో నటిస్తుంది. ఒక ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఒక పాట విడుదల అయింది. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. మంచి సంగీతం తో పాడు అద్భుతమైన సినిమాటోగ్రఫీ తో ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది.

ఒక పల్లెటూరి ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘దుల్కర్ సల్మాన్’ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి మరొక విశేషం ఏంటంటే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. రెండు మూడు రంగాల్లో ప్రవేశం ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం అనుపమ కూడా అదే త్రోవలో ఈ సినిమాలో తాను స్క్రీన్ ముందు, స్క్రీన్ వెనక పోషించబోయే రెండు పాత్రల్లో విజయవంతం అవ్వాలని చూస్తుంది. తన మొదటి సినిమా ‘ప్రేమమ్’ నుండి తనకి డైరెక్షన్ అంటే ఇష్టం ఉందని కానీ టైం కుదరకపోవడం వల్ల ఇన్నిరోజులు కుదరలేదని భవిష్యత్తులో పూర్తి సినిమా కూడా డైరెక్షన్ చెయ్యొచ్చు అని చెప్పింది అనుపమ.

ఈ సినిమా ద్వారా ‘గ్రెగొరీ’ అనే కొత్త నటుడు హీరో గా పరిచయం అవుతున్నాడు. ‘షాంజు’ అనే కొత్త దర్శకుడు కూడా తన మొదటి ప్రయత్నం గా ఈ సినిమా చేస్తున్నాడు. ‘సాజద్ కాకు’ సినిమాటోగ్రఫీ చేయనుండగా శ్రీ హరి నాయర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా విడుదల ప్రకటించినప్పటికీ ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేసే సూచనలు కనపడుతున్నాయి.

Maniyarayile Ashokan | Peyyum Nilaavu Video Song | Gregory | Anupama Parameswaran | K S Harisankar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular