టాలీవుడ్: తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు కొందరు బాలీవుడ్ సీనియర్ నటులు మెరుస్తూ ఉంటారు. పరేష్ రావల్, బోమన్ ఇరానీ ఇలా కొందరు సీనియర్ బాలీవుడ్ నటులు అప్పుడపుడు తెలుగు సినిమాల్లో కనిపిస్తారు. కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాల్లో కనిపిస్తారు. కానీ ఇప్పుడు ఇప్పటివరకు తెలుగులో కనిపించని బాలీవుడ్ సీనియర్ నటుడు ఒక మీడియం రేంజ్ హీరో సినిమాలో నటించనున్నాడు.
అనుపమ్ ఖేర్ బాలీవుడ్ లో సీనియర్ ఆర్టిస్టుగా, సీనియర్ టెక్నిషియన్ గా మంచి గుర్తింపు ఉంది. అనుపమ్ ఖేర్, నిఖిల్ నటించనున్న కార్తికేయ 2 సినిమాలో నటించనున్నాడు. ఈ రోజు అనుపమ్ ఖేర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని కార్తికేయ 2 టీం ట్విట్టర్ ద్వారా ప్రకటించి అనుపమ్ ఖేర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
నిఖిల్ హీరోగా 2014 లో విడుదలై సూపర్ హిట్ సాధించిన సినిమా కార్తికేయ. ఈ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 రూపొందించబడుతుంది. థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాని మొదటి పార్ట్ డైరెక్ట్ చేసిన చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేకర్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టీ.జి.విశ్వప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ కి జోడీ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ద్వారకలో కొనసాగుతుంది.