మూవీడెస్క్: అనుష్క శెట్టి కెరీర్‌లో ‘అరుందతి’ తర్వాత మరపురాని చిత్రం భాగమతి అని చెప్పవచ్చు. ఈ చిత్రం బాహుబలి 2 తర్వాత థియేటర్లలో విడుదలై, 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
అనుష్క రెండు భిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు అశోక్ ఈ సినిమాని హిందీలో ‘దుర్గావతి’ పేరుతో రీమేక్ చేయగా, ఆ చిత్రం అనుకున్నంతగా రాణించలేదు.
ఆ తర్వాత అశోక్ హిందీలో రొమాంటిక్ కామెడీ మూవీ చేశాడు కానీ అది కూడా ఫెయిల్ అయ్యింది.
ఇప్పుడు ఆయన తెలుగులో ‘భాగమతి’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అనుష్క ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
యూవీ క్రియేషన్స్ ఈ సీక్వెల్‌ను నిర్మించనుంది. భాగమతి కంటే ఈ సీక్వెల్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంచనా.
ఇటీవల అశోక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, భాగమతి సీక్వెల్ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. అనుష్క క్యారెక్టర్ మరింత శక్తివంతంగా డిజైన్ చేసినట్లు తెలిపారు.
అయితే, అనుష్క స్క్రిప్ట్ మొత్తాన్ని ఇంకా వినలేదట, పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాతే సినిమా స్టార్ట్ చేయడానికి ఒప్పుకుంటుందట.
అందుకే ప్రస్తుతం అశోక్ టీమ్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్‌గా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చని టాక్ వినిపిస్తోంది.