మూవీడెస్క్: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి త్వరలో మరో హర్రర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత అనుష్క సిల్వర్ స్క్రీన్ మీద కనిపించకపోయినా, తాజాగా మళయాళంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘కథనాల్ – ది వైల్డ్ సోర్సెరర్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్‌ను రోజిన్ థామస్ డైరెక్ట్ చేయగా, జయసూర్య ప్రధాన పాత్రలో నటించారు.
శ్రీ గోకుల్ మూవీస్ బ్యానర్‌పై 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
9వ శతాబ్దంలో క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనార్ జీవితం ఆధారంగా ఈ కథ రాశారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనుకుంటున్నారు.
అనుష్క కీలక పాత్రలో నటించడం వలన తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది.
వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతుందని, త్వరలోనే డేట్ ప్రకటించనున్నామని మేకర్స్ చెప్పుకొస్తున్నారు.
ఇదిలా ఉంటే, అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటీ’ అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తోంది.
‘కథనాల్’ మాదిరిగానే, ఈ సినిమా కూడా విభిన్న కథాంశంతో తెరకెక్కనుంది. అందుకే అనుష్క వీటికి రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడం సినీప్రియులను ఆసక్తిగా ఉంచుతోంది.