టాలీవుడ్: ఒక కమర్షియల్ హీరోయిన్ స్థాయి నుండి తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అంటే మొదలుగా గుర్తొచ్చే పేరు ‘అనుష్క’ అనే స్థాయి కి చేరింది అనుష్క. అరుంధతి, పంచాక్షరీ, భాగమతి.. ఇలా తన ట్రాక్ రికార్డ్ లో చాలా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ఉన్నాయి. ఈరోజు విడుదలైన ‘నిశ్శబ్దం’ కూడా అదే కోవకి చెందుతుంది. పోయిన సంవత్సరమే విడుదల అవ్వాల్సిన మూవీ చాలా వాయిదాలు పడింది. ఆ తర్వాత ఈ సంవత్సరం సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమా కరోనా వల్ల ఆలస్యం అయ్యి చివరికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఇవాల విడుదల అయింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇదొక హారర్ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. కానీ ఈ సినిమా హారర్ కి థ్రిల్లర్ కి మధ్యన ఉండి పోతుంది. సినిమా ఆరంభం చాలా ఆసక్తి కరంగా మొదలయింది. కానీ పోను పోను సినిమా పైన ఆసక్తి కలిగించడం లో దర్శకుడు విఫలమయ్యాడు. ఓటీటీ లో సినిమా చూస్తున్నప్పుడు మూవీ లెంగ్త్ కంట్రోల్ ప్రేక్షకుడి చేతిలో ఉన్నపుడు సినిమా చాలా ఆసక్తి కరంగా ఉండాలి. లేదంటే వెంటనే ఫార్వర్డ్ అప్షన్ తో ముందుకెళ్తాడు ప్రేక్షకుడు. ఈ సినిమా కూడా చూస్తున్న కొద్దీ చాలా సార్లే ఫార్వర్డ్ చేయాలి అనిపించేలా ఉంటుంది. ఒక హారర్ నుండి థ్రిల్లర్ జానర్ కి కథ మారి ఒక రివెంజ్ సినిమా లాగ అనిపిస్తుంది. కొంచెం ‘భాగమతి’, కొంచెం ‘మన్మధ’ సినిమాలు పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సినిమాల్లో లాజిక్ లు అలాగే ప్రతీ డీటెయిల్ ఇంపార్టెంట్. కానీ ఈ సినిమాలో అవి చాలా వరకు మిస్ అయ్యాయి అనిపిస్తుంది.
నటీనటుల విషయం లో అనుష్క పెద్దగా చెప్పుకొనే పాత్ర ఏమీ కాదు. ఇందులో తాను దైవాంగురాలు గా నటించింది. తన వరకు తాను బాగానే చేసుకుపోయింది. ఆ పాత్రని అలా రాసినందుకు తన యాక్టింగ్ కి ఇంకా కొన్ని బలమైన సీన్స్ ఉంటే బాగుండేది. మాధవన్ పాత్ర చాలా ఈజీ గా చేసుకుంటూ వెళ్ళాడు. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే మాధవన్ అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడు అనేది పెద్ద ప్రశ్న గా మిగులుతుంది. ఈ సినిమాలో మరో హాలీవుడ్ యాక్టర్ ‘మైకేల్ మ్యాడ్సన్’ నటించాడు. కొన్ని సార్లు ఆయన బాడీ లాంగ్వేజ్, హావ బావాలు చిరాకు తెప్పిస్తాయి. తన పాత్ర వరకు పరవాలేదనిపించాడు. ఈ సినిమాలో మరో రెండు పాత్రల్లో నటించిన షాలిని పాండే, అంజలి, అవసరాల శ్రీనివాస్ తమ తమ పాత్రల్లో బాగానే నటించారు. ఈ సినిమాలో కొంచెం చెప్పుకోదగిన క్యారెక్టర్ అంటే సుబ్బరాజు. చాలా రోజుల తర్వాత తనకి స్కోప్ కూడా ఎక్కువ ఉన్న పాత్రలో నటించాడు.
టెక్నిషియన్స్ విషయానికి వస్తే డైరెక్టర్ ‘హేమంత్ మధుకర్’ తనకి కావాల్సిన కాస్టింగ్, ప్రొడక్షన్, కాస్ట్ లభించినా కూడా సినిమా విషయం లో అంతగా ఆకట్టుకోలేదనిపిస్తుంది. మ్యూజిక్ విషయంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. థియేటర్ లో నే జనాలు పాటలు వస్తే లేసి బయటకి వెళ్తారు. ఇంక వాల్ల చేతికే ఫార్వర్డ్ ఒప్షన్ ఉంటె చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పాటలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా రెగ్యులర్ హారర్ మూవీలలో ఉండేవే. సినిమాటోగ్రఫీ మాత్రం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా లొకేషన్స్, కాస్ట్ మాత్రం ఎక్కడ తగ్గకుండా చూసుకున్నారు. సినిమా ప్రతీ ఫ్రేమ్ లో అది కనిపిస్తుంది. సినిమాలో పాజిటివ్ ఏంటి అంటే ప్రతీ ఫ్రేమ్ విసువల్ గా చాలా రిచ్ గా అనిపిస్తుంది .
ఓవరాల్ గా చెప్పాలంటే పెద్ద థ్రిల్స్, సస్పెన్స్ లేకుండా ‘నిశ్శబ్దం’ గా ఈ సినిమా చూసెయ్యొచ్చు .