టాలీవుడ్: అనుష్క, మాధవన్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. ఈ చిత్రం అక్టోబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో అందుబాటులో ఉండబోతుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ని రానా విడుదల చేసారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మెజారిటీ భాగం ఓవర్ సీస్ లోనే షూటింగ్ జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ – వివేక్ కూచిభోట్ల, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కోన వెంకట్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో ఇంకా అంజలి, షాలిని పాండే , శ్రీనివాస్ అవసరాల, సుబ్బ రాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
అనుష్క ఈ సినిమాలో ఒక మూగ అమ్మాయి పాత్రలో నటిస్తుంది. అనుష్క ఒక పెయింటర్ పాత్రలో నటిస్తుండగా , మాధవన్ మ్యూజిషియన్ పాత్రలో నటిస్తున్నాడు. అమెరికాలో ఓ ఇంట్లో జరిగే సంఘటనల చుట్టూ సినిమా కథ నడిచినట్టుగా ట్రైలర్ ను బట్టి అర్ధం అవుతోంది. అనుష్క బెస్ట్ ఫ్రెండ్ షోనాలి పాత్రలో షాలిని పాండే కనిపిస్తోంది. ఎంగేజ్మెంట్ అయిన రెండో రోజు నుంచి షోనాలి కనబడకుండా పోయింది అని చెప్పడం ద్వారా సినిమాలో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. అంజలి – సుబ్బరాజు లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా కనిపించారు. మొత్తానికి ట్రైలర్ ను సస్పెన్స్ అంశాలతో థ్రిల్ ని కలిగించారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వేచి చూడాల్సిందే.