గుంటూరు: ఆంధ్రప్రదేశ్ బీజేపీకి చెందిన ఓ నాయకుడి అసభ్యకర వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన ఈ నేత ఓ మహిళతో వీడియో కాల్ ద్వారా చేసిన అసభ్య సంభాషణ ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారింది. మహిళతో చేసిన మాటలలో ‘రేపు నాతో వస్తావా’, ‘మందు కొడదాం’ వంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలపాలవుతున్నాయి.
వీడియో వివరాలు
ఈ వీడియోలో సదరు బీజేపీ నేత, మహిళతో అనైతిక సంబంధాల గురించి మాట్లాడటం కనిపిస్తుంది. ‘రేపు ఇదే పూల చీరలో రా’, ‘రాత్రి ఏడు గంటలకు వచ్చేయ్’, ‘ఇద్దరం కలిసి మందు కొడదాం’ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వీడియోతో బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ శ్రేణుల్లో గుబులు మొదలైందని తెలుస్తోంది.
పార్టీ స్పందన
ఈ వ్యవహారం బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లింది. పై స్థాయి నేతలు ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ మీడియా విభాగం పర్యవేక్షిస్తున్న ఒక నేత ద్వారా పూర్తి వివరాలను సేకరించడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన మరో నేత కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం, ఇప్పుడు మరొక నేత రాసలీలలు బయటపడటం బీజేపీకి తలనొప్పి కలిగించే అంశంగా మారింది.
పరస్పర విరోధాలు
ఈ వ్యవహారం వెనుక బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు కారణమనే ప్రచారం కూడా జరుగుతోంది. వర్గపోరు కారణంగా ఆ ఇద్దరు నేతల వీడియోలు బహిర్గతమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బిగ్ ట్విస్ట్
ఈ వీడియో కాల్ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. అదేమిటంటే, గతంలో గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ నేత ఓ మహిళతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యిన విషయం అందరికీ తెలిసినదే.. ఆ మహిళే ఇప్పుడు బీజేపీ నేతతో మాట్లాడినట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె వేరే పార్టీలో ఉండగా.. ఆ తర్వాత బీజేపీలో చేరారు.