fbpx
Wednesday, October 30, 2024
HomeAndhra Pradeshఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు!

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు!

AP-CM-CHANDRABABU-GOING-DELHI

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీకీ వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో తను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవనున్నారు. అలాగే మిగతా కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశాఅం ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ఈ నెలలో ఇప్పటికే 3వ తేదీన ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసి వచ్చారు. ఈ నెలలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి కావడంతో ఆసక్తి రేపుతోంది.

ఈ రోజు 11 గంటలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది.సమావేశం ముగించుకుని ఇవాళ సాయంత్ర 4 గంటలకు సీఎం ఢిల్లీకి బయలుదేరనున్నారు.

అమిత్ షాతో భేటీ సందర్భంగా ఆయన రాష్ట్ర విభజన సమస్యలు, వాటి పరిష్కారాల విషయమై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో నెలకొన్న ఇతర రాజకీయ పరిస్థితుల పైన కూడా ఆయన చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular