fbpx
Friday, December 27, 2024
HomeAndhra Pradeshఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!

AP-COVID-CASES-DECLINE-IN-LAST-FEW-DAYS

అమరావతి: ఏపీ‌లో రోజురోజుకి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 41,173 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 878 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా గత 24 గంటలలో కరోనా వల్ల 13 మంది మృత్యువాతపడ్డారు. ఈ మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 13,838 కు చేరుకుంది.

అదే సమయంలో 1,182 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు, అలాగే ఇప్పటివరకు మొత్తం 19,84,301 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ మేరకు కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,862 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని బులెటిన్ తెలిపింది.

ఏపీ పరిస్థితి ఇలా ఉండగా భారత్‌లో ఆదివారం 45,083 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. దీంతో ప్రస్తుత యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,68,558కు పెరిగింది. కాగా దేశంలో యాక్టివ్‌ కేసులు పెరగడం ఇది వరుసగా అయిదవ రోజు.

24 గంటల్లో 460 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,37,830కు చేరుకుంది. శనివారం 17,55,327 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టు పాజిటివిటీ రేటు 2.28గా నమోదైంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కింద 63.09 కోట్ల డోసుల టీకాలు వేశారు. ఇటీవల వరుసగా నాలుగు రోజుల పాటు కేరళలో 30 వేలకు పైగా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 29,836 కరోనా కేసులు బయటపడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular