అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కి ప్రస్తుత సీఎస్ అయిన నీలం సాహ్ని ఈ నెల డిసెంబర్ 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఏపీ కి కొత్త సీఎస్ ను ప్రభుత్వం నియమించింది. ఆదిత్యనాథ్ దాస్ ను ఏపీ నూతన సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. నీలం సాహ్నీని సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
దీనితో పాటు పురపాలక కార్యదర్శి గా శ్రీలక్ష్మిని, జలవనరుల శాఖ కార్యదర్శిగా శ్యామలారావు ని, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి గా సునీతను నియమించారు.