fbpx
Sunday, November 24, 2024
HomeAndhra Pradeshఏపీలో కర్ఫ్యూ మార్గదర్శకాలు జారీ

ఏపీలో కర్ఫ్యూ మార్గదర్శకాలు జారీ

AP-CURFEW-GUIDELINES-ISSUED

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కర్ఫ్యూ కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం రోజున ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కర్ఫ్యూ ఈ రోజు అనగా మే 5 (బుధవారం) నుంచి మే 18 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్రం విధించిన ఈ కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు అన్నీ మూసివేయాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, వ్యాపారాలకు తెరవడానికి అనుమతి ఉంటుంది.

కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఎవరెవరికంటే:

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులు, ప్రింట్‌ –ఎల్రక్టానిక్‌ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్‌నెట్, పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, కోల్డ్‌ స్టోరేజీలతోపాటు గిడ్డంగులు, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్‌ బంకులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, గ్యాస్‌ ఔట్‌లెట్‌లు, విద్యుత్‌ ఉత్పత్తి, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతోపాటు అన్ని వ్యవసాయ పనులు అనుమతించబడ్డాయి.

కేంద్ర ప్రహుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థల్లో పనిచేసేవారు డ్యూటీ పాస్‌తో కర్ఫ్యూ సమయంలో తిరగొచ్చు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది (ప్రభుత్వ మరియు ప్రైవేటు) తగు గుర్తింపు కార్డుతో తిరగొచ్చు.

ఇంఖా వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, గర్భిణులు, కోవిడ్‌ టీకాలకు వెళ్లే వ్యక్తులు, ఆరోగ్య సేవలు పొందడానికి వెళ్లే వ్యక్తులు ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి. రైల్వేస్టేషన్లకు మరియు విమానాశ్రయాలకు వెళ్లే వారికి ఖచ్చితంగా టికెట్‌ ఉండాలి.

అంతర్రాష్ట్ర, అంతర్‌ జిల్లాల ప్రజా రవాణాను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తారు. ఇక పెళ్లిళ్లకు మరియు ఫంక్షన్లకు మాత్రం కేవలం 20 మందికి అనుమతి ఉంటుంది. ఈ వేడుకలు నిర్వహించుకోవడానికి ముందుగా స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular