ఏపీ: ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా భారీ నిధులను విడుదల చేసింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు రూ.1554.99 కోట్లను కేటాయించగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు అత్యధికంగా రూ.608.8 కోట్లు లభించాయి.
తెలంగాణకు రూ.231.75 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు కేటాయించగా, ఏపీకి కేటాయించిన నిధులు దేశంలోనే టాప్‌గా నిలిచాయి.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్ (NDMF) కింద ఈ నిధులను కేంద్రం త్వరలోనే విడుదల చేయనుంది. 2024లో వరదలు, తుఫాన్లు, వర్షపాతం వల్ల ఏపీ భారీ నష్టాలను ఎదుర్కొంది.
ఈ నష్టాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం, రాష్ట్రానికి సత్వర సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. సీఎం చంద్రబాబు కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్లే ఈ కేటాయింపులు సాధ్యమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.