అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగబోతోంది. ఈ సమావేశం సచివాలయంలోని సీఎం కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈసారి మంత్రివర్గ సమావేశాన్ని పేపర్‌లెస్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. గతంలో కేబినెట్ సమావేశాల్లో మంత్రులకు నోట్స్ అందించగా, ఈసారి మాత్రం ఈ-కేబినెట్‌ను అమలు చేస్తున్నారు.
అజెండా నుంచి నోట్స్ వరకు సంబంధించిన సమాచారం ఈ-ట్యాబ్‌ల ద్వారా మంత్రులకు అందించనున్నారు.
ఇప్పటికే సచివాలయ అధికారులు, మంత్రులు మరియు వారి వ్యక్తిగత కార్యదర్శులకు ట్యాబ్‌ల వాడకంపై శిక్షణను అందించారు.
2014-19 కాలంలో టీడీపీ ప్రభుత్వంలో ఈ-కేబినెట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానం నిలిపివేశారు.
తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు, రాబోయే సమావేశాలను పేపర్‌లెస్ పద్ధతిలో నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ-కేబినెట్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.