విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరో సారి తన పంజా విసురుతోంది. తాజాగా రోజూ వెయ్యి కి పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాగా ఇటీవల కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఏపీ మాజీ మాంత్రి అయిన నడకుదిటి నరసింహారావు కారోనా బారిన పడ్డారు.
ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ సాయంత్రం మృతి చెందారు. 1994 సంవత్సరంలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు.
2004 లో జరిగిన ఎన్నికల్లో ఆయన మచిలీపట్నం నుండి పోటీ చేసి ఓడిపోయారు. నడకుంటి నరసింహారావు మృతి పట్ల తెలుగుదేశం నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో కృష్ణా జిల్లాలో విషాదం అలుముకుంది.