fbpx
Tuesday, January 28, 2025
HomeAndhra Pradeshఆర్థిక పరిస్థితి చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

ఆర్థిక పరిస్థితి చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

ap-financial-situation-chandrababu-comments

ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని తెలిపారు. 2019 నాటి వృద్ధిరేటు కొనసాగి ఉంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలపడేదని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్రం నుంచి నిధులు రావడం వల్ల విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని తెలిపారు.

అయితే, రాష్ట్ర అప్పులు రూ.9.5 లక్షల కోట్లకు చేరుకున్నాయని, వాటిపై వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత కూడా ఉందని వివరించారు. ఆర్థిక పరిస్థితి బలపడిన వెంటనే పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

‘‘మాట తప్పడం నా నైజం కాదు. ప్రజలకు వాస్తవం చెబుతున్నా. డబ్బులు ఉండగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తాం. అప్పు చేయాల్సి వచ్చినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని విమర్శిస్తూ, తాము సంక్షేమ పథకాల అమలులో ఎప్పుడూ వెనుకడుగు వేయబోమని ఆయన వెల్లడించారు. ఐదేళ్ల విలువైన సమయం నష్టపోయినా, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular