fbpx
Saturday, January 18, 2025
HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతి!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతి!

AP-GOVERNMENT-EMPLOYEES-TRANSFERS-BAN-LIFTED

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించింది. ఆమేరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో విధించిన బ్యాన్‌ను ఎత్తేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది.

కాగా ఈ బ్యాన్ ఎత్తివేత ద్వారా ఈ నెల అంటే జూన్‌ 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మాత్రమే బదిలీలకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఒకే స్థానంలో ఐదు సంవత్సరాలకు పైన పని చేస్తున్న ఉద్యోగులకు ఖచ్చితంగా బదిలీ అవకాశం కల్పిస్తున్నారు.

కాగా ఈ బదిలీలు ఊద్యోగి యొక్క వ్యక్తిగత వినతులు మరియు పరిపాలన సౌలభ్యం ఆధారంగా మాత్రమే చేపడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular