అమరావతి: ఏపీ లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అమలాపురం మాజీ ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు మరియు మైనార్టీ మహిళా నేత ఎం.జకియా ఖానమ్ లకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
తమ పేర్లను ఎమ్మెల్సీలకు నామినేట్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తాము రుణపడి ఉంటామని డాక్టర్ పండుల రవీంద్రబాబు, ఎం.జకియా ఖానమ్‌లు పేర్కొన్నారు. మంగళవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ముస్లిం మైనారిటీ మహిళగా ఉన్న తనకు సీఎం గారు నమ్మకంతో నాకు ఇచ్చిన ఇంత పెద్ద పదవిని, బాధ్యతని మహిళా సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తానని, చట్ట సభలో ముస్లిం మైనార్టీ మహిళల తరఫున తన వాణిని వినిపిస్తానని జకియా ఖానమ్ చెప్పారు.
అధికారంలోకి రాగానే నేతలు తమ హామీలను మరిచిపోయే నేతలను చూశము, కానీ, సీఎం వైఎస్ జగన్ తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ఎన్నికల ప్రచార సమయంలో తనకిచ్చిన హామీని నెరవేర్చడం సంతోషం కలిగించిందని రవీంద్రబాబు పేర్కొన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక అన్నగా నిలబడి ముందుకు తీసుకువెళుతున్న వైఎస్ జగన్ వెంటే తానెన్నటికీ రుణపడి ఉంటానన్నారు.