అమరావతి: కరోనా విషయమంలో మొదటి నుండి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలో అత్యధిక టెస్టులు నిర్వహించిన రాష్ట్రంగా నిలిచింది. కాంటాక్ట్ ట్రేసింగ్ లో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. తాజాగా రాష్ట్రంలొ కేసులు అధికంగా పెరుగుతున్న దృష్ట్యా, గ్రామ/వార్డు సచివాలయాలకు ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ భాద్యతను అప్పగించింది. కాంటాక్ట్ ట్రేసింగ్ ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా వైరస్ వ్యాప్తిని తగ్గించగలమన్నది ఏపీ ప్రభుత్వ భావన.
కరోనా విషయంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉండి, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని మాత్రమే ఆస్పత్రులో చేర్చి వైద్యం అందిస్తోంది.
అయితే వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్న వారిని మాత్రం హోం క్వారంటైన్ లో ఉంచుతోంది. కాగా ఈ హోం క్వారంటైన్ లో ఉన్న వారు మెడికల్ అవసరాలకు బయటకు వస్తే ఇరతులకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున్, ఇక నుండి హోం క్వారంటైన్ లో ఉన్నవారికి “హోం క్వారంటైన్ కిట్” లను ఇంటికే పంపే విధంగా నిర్ణయం తిసుకుంది.
ఈ హోం క్వారంటైన్ కిట్ లో ఉండే వస్తువుల వివరాలు:
- కరోనా మందులు
- శానిటైజర్లు
- మాస్కులు
- ఆక్సీమీటర్లు
- గ్లౌజ్ లు
హోం క్వారంటైన్ లో ఉండే వారందరికి ఈ హోం క్వారంటైన్ కిట్లు సరఫరా చేసి వారిని బయటకు రాకుండా చేయడం వలన వైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రణాళిక రూపొందించింద్.