విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
ఏపీ రవాణాశాఖ కమిషనర్ గా పని చేస్తున్న కాటమనేని భాస్కర్ బదిలీ కాగా, పి. రాజబాబుకు రవాణాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
కాగా మిషన్ కృష్ణా మరియు గోదావరి ఎండీగా కాటమనేని భాస్కర్ ను, మరియు జీసీసీ ఎండీగా జి. సురేష్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.