ఏపీ: ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. ఫిజిక్స్ వాలా ఎడ్యుటెక్ సంస్థ, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్‌తో ఎంవోయూలు సంతకం చేశారు.
ఈ ఒప్పందాల ద్వారా ఏపీ యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్కిల్స్‌ను అందించి, ఉన్నత విద్యా వ్యవస్థను ఆధునీకరించడం లక్ష్యంగా ఉంది.
ఫిజిక్స్ వాలా ఎడ్యుటెక్ కంపెనీ, అమెజాన్ వెబ్‌తో కలిసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE), యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ (UoI)ను ఏర్పాటు చేయనుంది.
ఈ విశ్వవిద్యాలయం పరిశోధన, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా పనిచేయనుంది. మరోవైపు, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ (TBI)తో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యం కలిగించడమే లక్ష్యం” అని అన్నారు.
ఆన్‌లైన్, హైబ్రిడ్ పద్ధతుల్లో విద్యను అందిస్తూ, పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా స్కిల్స్‌ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ ఒప్పందాలు ఏపీ యువతకు గ్లోబల్ స్థాయిలో అవకాశాలను తీసుకురావడం ఖాయమని తెలిపారు.