అమరావతి: నిన్ననే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నాలుగవ రోజు సమావేశాల్లో ఈ రోజు శాసన మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
శాసన మండలి రద్దు ఉపసంహరణ తీర్మానాన్ని ఇవాళ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, మండలి రద్దు నిర్ణయం తర్వాత సందిగ్ధత నెలకొందని, దాన్ని తొలగించడానికే శాసన మండలిని కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
క్రితంలో ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన శాసన మండలిని, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పునరుద్ధరించారని ఆయన గుర్తు చేశారు. 2019లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ చారితాత్మక నిర్ణయాలు చట్టరూపం దాల్చాలనే ఉద్దేశంతో ఉండగా ఆలస్యం జరుగుతూ వచ్చిందని తెలిపారు.