అమరావతి: మంత్రి నారా లోకేష్ ‘రెడ్ బుక్’ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమేనని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందంటూ వైఎస్ఆర్‌సీపీ చేసిన విమర్శలపై లోకేష్ స్పందించారు.
గత ఐదేళ్లలో తాను పాల్గొన్న ప్రతి సమావేశంలోనూ ప్రజలకు రెడ్ బుక్ గురించి వివరించినట్లు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై శిక్షించాలనే ప్రజల తీర్పు కూడా ఉందని చెప్పారు.
జోగి రమేష్ కుమారుడు భూమి కబ్జా చేశాడని, అలాంటి వ్యక్తుల గురించి ప్రజలకు తెలుసుకోవాలని లోకేష్ సూచించారు. భూకబ్జా చేసిన వారిని వదిలేయాలా? అని ఆయన ప్రశ్నించారు. రేపు లిక్కర్ స్కాంపై చర్యలు ఉంటాయని, ఇసుక దందాపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి స్కాంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉండి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం శిక్షిస్తామని నారా లోకేష్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.