fbpx
Sunday, November 24, 2024
HomeAndhra Pradeshవిడుదలైన మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్

విడుదలైన మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్

AP-MUNICIPAL-ELECTION-NOTIFICATION-RELEASED

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో సారి ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికలు ఇంకా జరుగుతూ ఉండగా ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల నగరా మోగింది. ఎన్నికలు 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీలకు ఎన్నికల కమీషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.

విడుదలైన ఈ షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా సమయంలో ఆగిపోయిన మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ ఈసీ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతేడాది మార్చి 15న నిలిచిన ప్రక్రియ నుంచే కొనసాగించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవడానికి గడువు ఇచ్చారు.

ఎన్నికలు జరిగే మున్సిపల్‌ కార్పొరేషన్లు: విజయనగరం, విశాఖ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం.

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు:
శ్రీకాకుళం జిల్లా: ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ
విజయనగరం జిల్లా: బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల.
విశాఖ జిల్లా: నర్సీపట్నం, యలమంచిలి.
తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం
పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం‌, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం.
కృష్ణా జిల్లా: నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు
గుంటూరు జిల్లా: తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల.
ప్రకాశం జిల్లా: చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు.
నెల్లూరు జిల్లా: వెంకటగిరి, ఆత్మకూరు(ణ్), సూళ్లూరుపేట, నాయుడుపేట.
అనంతపురం జిల్లా: హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి.
అనంతపురం జిల్లా: రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర.
కర్నూల్‌ జిల్లా: ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్‌, ఆళ్లగడ్డ.
కర్నూల్‌ జిల్లా: నందికొట్కూరు, గూడూరు(ఖ్), ఆత్మకూరు(ఖ్).
వైఎస్సార్‌ జిల్లా: ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్‌, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల.
చిత్తూరు జిల్లా: మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular