fbpx
Sunday, January 19, 2025
HomeAndhra Pradeshఏపీలో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు విడుదల

ఏపీలో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు విడుదల

AP-NEW-INDUSTRIAL-POLICIES

అమరావతి: ఏపీలో కొత్త పారిశ్రామిక విధానాన్ని, పారిశ్రామిక​ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఈ నూతన పాలసీని విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకు ప్రతిరూపం, ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం, పెట్టుబడిదారులు నష్టపోకుండా కావలసిన చర్యలపై సమదృష్టి చూపనుంది.

ఈ నూతన పారిశ్రామిక విధానాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) ఈ పాలసీలు పెద్ద సాయంగా నిలవనున్నాయి. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్‌ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయి.

ఈ నూతన పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఎపీఐఐసి చైర్ పర్సన్ రోజా, సంబంధిత అధికారులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular