fbpx
Monday, October 28, 2024
HomeAndhra Pradeshఏపీలో పలువురికి నామినేటెడ్ పదవుల కేటాయింపు!

ఏపీలో పలువురికి నామినేటెడ్ పదవుల కేటాయింపు!

AP-NOMINATED-POSTS-ANNOUNCED-TODAY-BY-HOME-MINISTER

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ విధేయులకు సీఎం జగన్ పలు కీలక నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు. ఈ నామినేటెడ్‌ పదవుల పూర్తి వివరాలను హోం మంత్రి మేకతోటి సుచరిత ఇవాళ ప్రకటించారు. ఈ పదవుల భర్తీలో అన్ని రకాల సామాజిక వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూర్పు చేశారు.

నూతనంగా కేటాయించిన ఈ పదవులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దాదాపు 56 శాతం పదవులను కేటాయించారు. మొత్తం కేటాయించిన 135 పోస్టుల్లో అధికంగా మహిళలకు 68 మరియు పురుషులకు 67 పదవులు ఇచ్చారు. కొన్ని ముఖ్యమైన నామినేటెడ్‌ పదవుల వివరాలు:

►కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషు
►క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పాతపాటి సర్రాజు
►కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌
►బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్‌
►రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి
►ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి
►ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి (క్రితంలో ఎమ్మెల్యే రోజా)
►వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌గా ఖాదర్ బాషా
►శాప్ ఛైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్ధ్‌రెడ్డి
►శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి
►శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా బి. బీరేంద్రవర్మ
►కాణిపాకం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా జ్ఞానేంద్రరెడ్డి

►ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి
►ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నార్తు రామారావు
►సీడ్‌యాప్‌ ఛైర్మన్‌గా సాది శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
►ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి
►ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్నకుమార్‌
►ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్‌
►ఏపీ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌
►రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు
►నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ
►సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా టి.ప్రభావతి
►సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
►రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావు
►ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాథ్‌
►కార్మిక సంక్షేమ బోర్డు వైస్‌ఛైర్మన్‌గా దాయల నవీన్‌
►రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి
►రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు

పూర్తి వివరాల పీడీఎఫ్ కోసం క్లిక్ చేయండి (మూలం: సాక్షి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular