బద్రీనాథ్: ఆంధ్రప్రదేశ్ యాత్రికులు బద్రీనాథ్ యాత్రలో ఉన్నప్పుడు కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయితే, అందరూ క్షేమం గా ఉన్నారని సమాచారం అందింది. హోంమంత్రి అనిత యాత్రికులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు గురించి వివరాలు తెలుసుకున్నారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో యాత్రికుల సహకారం కోసం సమన్వయం చేశారు. అధికారులు హోంమంత్రి అనితకు అందజేసిన సమాచారం ప్రకారం, ఏపీ యాత్రికులు రుద్రప్రయాగ చేరుకున్నట్టు తెలిసింది.
యాత్రికులు రుద్రప్రయాగ నుంచి తమ స్వస్థలాలకు బయలుదేరినట్టు వివరించారు. నిన్న సాయంత్రం గోచార రుద్రప్రయాగ వద్ద కొండచరియలు విరిగిపడటంతో, అధికారులు బద్రీనాథ్ వెళ్లే మార్గాన్ని మూసివేశారు.
ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు అక్కడే నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాడిపత్రికి చెందిన 40 మంది భక్తులు రోడ్డుపై తాత్కాలికంగా వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ అంశం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సంబంధిత అధికారులకు ఈ విషయం తెలపడంతో సహాయం అందించడానికి చర్యలు తీసుకున్నారు.