అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష యొక్క ఫలితాలను రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివద్ధి మరియు శిక్షణ శాఖమంత్రి శ్రీ మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇవాళ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అందరికీ శుభాభినందనలు తెలియజేశారు.
రాష్ట్రంలో అమలులో ఉన్న జగనన్న విద్యాదీవెన పథకం వల్ల 81వేల మంది విద్యార్థులకి రూ.128 కోట్లు అందజేశామని ఆయన తెలిపారు. 72 వేల మంది విద్యార్థులకి జగనన్న వసతి దీవెనగా రూ.54 కోట్లు అందజేశామని తెలిపారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం, అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు గా నిలిచినట్లు తెలిపారు.
కాగా అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాగా ప్రకాశం నిలిచింది అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజులు పాల్గొన్నారు.