అమరావతి: దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మరీ పెరిగుతున్నాయి. ఇవాళ దేశంలొ 1,34,154 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి 1.23 లక్షల కేసులకంటే కాస్త ఎక్కువ. కాగా 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకోంది. ఏపీలో 86,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 11,421 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 17,25,682 మందికి కరోనా వైరస్ సోకినట్లయింది. అయితే నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి రాష్ట్రంలో 81 మంది మృతి చెందారు. ఈ సంఖ్యతో మొత్తం మరణాల సంఖ్య 11,213 కు చేరింది. అదే విధంగా గత 24 గంటల్లో 16,223 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 15 లక్షల 78 వేల 452 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దీనికి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,38,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,95,34,279 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.