fbpx
Thursday, November 28, 2024
HomeAndhra Pradeshఏపీలో వాలంటీర్ల వ్యవస్థను తొలగించేది లేదని స్పష్టం చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి!

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను తొలగించేది లేదని స్పష్టం చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి!

AP-Social Welfare Minister-Dola Bala Veeranjaneya Swamy

అమరావతి: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం తీసేస్తోందని, వాలంటీర్ల భవిష్యత్ ప్రశ్నార్థకమని జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు.

ఎన్డీయే ప్రభుత్వం వాలంటీర్ల భవిష్యత్‌ విషయంలో చిత్తశుద్ధితో ఉందని, వారిపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు.

వాలంటీర్ల భవిష్యత్‌పై స్పష్టత:

సోమవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, చంద్రబాబు ప్రభుత్వం వాలంటీర్లను ఎప్పుడు మోసం చేయదని, వారి కోసం మంచి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

“తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడే ఉంది. వాలంటీర్లు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు,” అని డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

వాలంటీర్లకు హామీ:

“ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ, కూటమి మేనిఫెస్టోలో పొందుపర్చిన విషయాలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. వాలంటీర్లు తమ భవిష్యత్‌ గురించి ఆందోళన చెందవద్దు. మిమ్మల్ని భయాందోళనలకు గురిచేసే తప్పుడు కథనాలనూ నమ్మవద్దు,” అని మంత్రివర్యులు సూచించారు.

దుష్ప్రచారం తిప్పికొట్టాలి:

“ఎన్డీయే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు దుష్ప్రచారం చేస్తే, ఉపేక్షించేది లేదు. వాలంటీర్‌ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. వాలంటీర్‌ సేవలను ఏడాది నుంచి రెన్యువల్‌ చేయకుండా మోసం చేసింది గత ప్రభుత్వమే. వైసీపీ నేతలు తమ ప్రయోజనాల కోసం వాలంటీర్లతో బలవంతంగా రాజీనామలు చేయించారు. ఈ విషయాన్ని ఆ వాలంటీర్లు మరిచిపోకూడదు,” అని డోలా బాల వీరాంజనేయ స్వామి గుర్తు చేశారు.

వైసీపీపై ఆరోపణలు

“వైసీపీ నేతలు ఎన్నికల్లో గెలిచేందుకు వాలంటీర్లను రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి, వారి భవిష్యత్‌ను అయోమయంలోకి నెట్టేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. వైసీపీ శ్రేణులు చేసే మోసపూరిత ప్రచారాలను నమ్మవద్దు,” అని డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.

సోషల్ మీడియా ప్రచారం:

వాలంటీర్ల సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు తొలగించడం వాలంటీర్లను తొలగించడమేనని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఈ విధంగా స్పందించారు. “వాలంటీర్ల భవిష్యత్‌ కోసం కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు,” అని డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular