అమరావతి: సామాజిక పెన్షన్లు తీసుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెలాఖరుకే అంటే ఆగస్టు 31వ తేదీనే పింఛన్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో సాధారణంగా సామాజిక పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీన ఇస్తూ వస్తున్నారు. అయితే, ఈ సారి సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం వచ్చింది.
కాగా, ఈ నేపథ్యంలో పెన్షన్లను ఒక రోజు ముందుగానే ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ఒకవేళ, అందుబాటులో లేకపోవడం కానీ, ఇతరత్రా కారణాలేవైనా ఉండి పెన్షన్లు తీసుకోలేని వారికి సెప్టెంబరు 2వ తేదీ సోమవారం ఇవ్వాలని సీఏం ఆదేశించారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంతకు ముందు 3000 రూపాయలుగా ఉన్న సామాజిక పెన్షన్ ను ఒకే సారి రూ.4 వేలకు పెంచిన సంగతి తెలిసిందే.
వీటితో పాటు మిగతా పెన్షన్లైన దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా పెన్షన్ ను కూడా ప్రభుత్వం పెంపుదల చేసింది.