fbpx
Friday, January 17, 2025
HomeBig Storyఅపోలో జేఎండీ సంగీతారెడ్డికి వ్యాక్సిన్‌ తీసుకున్నాక పాజిటివ్‌!

అపోలో జేఎండీ సంగీతారెడ్డికి వ్యాక్సిన్‌ తీసుకున్నాక పాజిటివ్‌!

APOLLO-JMD-TESTED-POSITIVE-EVEN-AFTER-VACCINATION

హైదరాబాద్‌: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అపోలో జేఎండీ సంగీతారెడ్డికి కరోనా వైరస్ సోకింది. తాను రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా ఈ నెల అనగా జూన్‌ 10న కోవిడ్‌-19 బారిన పడినట్లు సంగీతారెడ్డి ట్వీట్‌ ద్వారా తెలిపారు. రెండు డోసుల వ్యా‍క్సిన్‌ తీసుకున్న తరువాత కూడా అన్ని జాగ్రత్తలు పాటించాను అయినా నాకు కరోనా సోకడం షాక్‌కు గురి చేసిందని తెలిపారు.

అయితే కరోనా విషయంలో వ్యాధినిర్ధారణ మరియు చికిత్స, ఈ రెండూ చాలా కీలకమైన అంశాలని ఆమె తెలిపారు. కరోనా సోకిన తరువాత విపరీతమైన జ్వరం రావడంతో తాను ఆస్పత్రిలో చేరానని ఆమె తెలిపారు. అయితే కాక్టెయిల్ ట్రీట్మెంట్, రీజెనెరాన్ థెరపీద్వారా ప్రస్తుతం తను కోలుకుంటున్నాను అని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆమె వ్యాక్సిన్‌ కరోనాను పూర్తిగా అడ్డుకోలేదు, అయితె శరీరంపై వైరస్‌ ప్రభావం తీవ్రం కాకుండా మాత్రం నిరోధిస్తుందని సంగీతారెడ్డి తెలిపారు. కాబట్టి అందరూ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా తగు జాగ్రత్తలు మరవొద్దు అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular