ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌కు భారీ వేతన పెంపు లభించింది. 2024 సంవత్సరానికి కుక్ వేతనాన్ని 18 శాతం పెంచుతూ ఆపిల్ నిర్ణయం తీసుకుంది. 2023లో 63.2 మిలియన్ డాలర్లుగా ఉన్న కుక్ వేతనం ఈ ఏడాది 74.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.643 కోట్లు) చేరనుంది.
ఆపిల్ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ కీలక ప్రకటన వెలువడింది. ఈ పెంపులో కనీస వేతనం 3 మిలియన్ డాలర్లు, స్టాక్ అవార్డులు 58.1 మిలియన్ డాలర్లు, అదనపు పరిహారం 13.5 మిలియన్ డాలర్లుగా ఉంటాయి.
2023లో కుక్ వేతన ప్యాకేజీ గణనీయంగా పెరగడం, 2025 వరకు అదనపు మార్పులు ఉండబోవడం ఆపిల్ స్పష్టంచేసింది.
ఆపిల్ కంపెనీ విజయాలను మరింత ముందుకు తీసుకువెళ్లిన కుక్ ఈ నిర్ణయంతో సీఈవోల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. వ్యాపార వర్గాల్లో ఈ పెంపుపై చర్చ నడుస్తోంది.