అమరావతి: ఏపీ శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్‌లు, విప్‌ల నియామకాలు
ఏపీ శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్‌లు, విప్‌ల నియామకాలు పూర్తి చేశారు. ఈ నియామకాల్లో తెదేపా ఎమ్మెల్యేలు, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు విప్ గా నియమితులయ్యారు. ఏపీ శాసనసభ చీఫ్ విప్‌గా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలిలో చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు.
శాసనసభలో విప్‌లు
ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు(భాజపా)
అరవ శ్రీధర్, కోడూరు -ఎస్సీ(జనసేన)
బెందాళం అశోక్ – ఇచ్ఛాపురం (తెదేపా)
బొలిశెట్టి శ్రీనివాస్- తాడేపల్లిగూడెం (జనసేన)
బొమ్మిడి నారాయణ నాయకర్- నరసాపురం (జనసేన)
బొండా ఉమామహేశ్వరరావు- విజయవాడ సెంట్రల్ (తెదేపా)
దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు)- ముమ్మిడివరం (తెదేపా)
దివ్య యనమల- తుని (తెదేపా)
వి.ఎం.థామస్- గంగాధర నెల్లూరు(ఎస్సీ) (తెదేపా)
జగదీశ్వరి తోయక – కురుపాం(ఎస్టీ) (తెదేపా)
కాలవ శ్రీనివాసులు- రాయదుర్గం (తెదేపా)
మాధవి రెడ్డప్పగారి – కడప (తెదేపా)
పీజీవీఆర్ నాయుడు(గణబాబు)- విశాఖ వెస్ట్(తెదేపా)
తంగిరాల సౌమ్య- నందిగామ (ఎస్సీ) (తెదేపా)
యార్లగడ్డ వెంకట్రావు- గన్నవరం (తెదేపా)
శాసనమండలిలో విప్‌లు
వేపాడ చిరంజీవి రావు(తెదేపా)
కంచర్ల శ్రీకాంత్ (తెదేపా)
పి.హరిప్రసాద్ (జనసేన)
ఈ విప్ నియామకాల్లో జనసేనకు ముగ్గురు అసెంబ్లీ విప్ లు, ఒక మండలి విప్ లు కల్పించగా, భాజపా కు ఒక అసెంబ్లీ విప్ అవకాశం లభించింది. ఇంకా అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రకటించాల్సి ఉంది.