fbpx
Monday, November 4, 2024
HomeAndhra Pradeshఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు

ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు

APSRTC-OUTSOURCING-EMPLOYEES-FREE-BUSPASS

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది. వచ్చే ఏడాది 2021 జనవరి 1వ తేది నుంచి దీన్ని అమలు చేయబోతోంది. ఆర్టీసీలో మొత్తం దాదాపు 5 వేల మంది ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు.

ఈ ఉద్యోగులందరూ ప్రతి రోజూ తమ నివాసం నుంచి డిపో/యూనిట్లకు సొంత ఖర్చులతో ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యం కల్పించాలని గత కొద్ది కాలంగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్ధేశంతో ఈ ఉచిత బస్‌పాస్‌లు మంజూరు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఈ సందర్భంగా తెలిపారు. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ బస్‌ పాస్‌లు చెల్లుబాటవుతాయి. ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే వారు తమ నివాసం నుంచి 25 కి.మీ.లోపు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular