fbpx
Friday, October 18, 2024
HomeInternationalఅమెరికా ఎన్నికల ప్రచారంలో ఏఆర్ రెహమాన్

అమెరికా ఎన్నికల ప్రచారంలో ఏఆర్ రెహమాన్

AR-Rahman-to-Perform-at-Kamala-Harris-Support-Rally-During-US-Elections

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ప్రచార సభల్లో పాల్గొంటూ, అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో ఆసక్తికర అప్‌డేట్ ఒకటి వెలువడింది. “ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్” (ఏఏపీఐ) నిధుల సేకరణ బృందం ప్రకటించినట్లు, కమలా హారిస్ మద్దతుగా జరగబోయే ఒక ప్రచార సభలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు.

ఈ కాన్సర్ట్ తేదీ, ఇతర వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబడతాయి. ప్రస్తుతం, ఏఆర్ రెహమాన్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, అయితే త్వరలో డేట్ ఫిక్సైన తర్వాత రెహమాన్ నుండి ప్రకటన రావచ్చని అంటున్నారు. కమలా హారిస్‌కి మద్దతుగా రెహమాన్‌ కాన్సర్ట్‌ జరగబోతున్నదని తెలిసిన వెంటనే, ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అన్ని దిశల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ కాన్సర్ట్‌ ద్వారా కమలా హారిస్‌ తమ ప్రచారంలో మరింత ఊపందుకోగలరని అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular