ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని, దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అరకు కేఫ్‌లు విస్తరిస్తున్న తీరు చూసి ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. పారిస్ కేఫ్‌ల్లో అరకు గిరిజన జీవనశైలిని ప్రతిబింబించే ఫోటోలు, వీడియోలను ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై ప్రదర్శించనున్నట్టు తెలిపారు.
కాఫీ ప్యాకేజింగ్‌కి గిరిజనుల వేషధారణతో పాటు భారతీయ సంప్రదాయ రంగులు, డిజైన్లను ఉపయోగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.
ఇప్పటికే మార్చి 29న ఆనంద్ మహీంద్రా అరకు కాఫీపై మరో ఆసక్తికర వీడియోను ట్విటర్ (X) వేదికగా షేర్ చేశారు. “పారిస్‌లో మా రెండో అరకు కాఫీ స్టాల్” అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ అయింది.
ఇది చూసిన సీఎం చంద్రబాబు స్పందిస్తూ, “పచ్చని అరకు లోయ నుంచి పారిస్ నగరానికి మేడ్ ఇన్ ఏపీ ఉత్పత్తులు చేరడం గర్వకారణం. ఇది రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపును తీసుకువస్తోంది,” అని వ్యాఖ్యానించారు.