కోలీవుడ్: ముని, కాంచన, గంగ, కాంచన 3 లాంటి వరుస సిరీస్ సినిమాలతో డైరెక్టర్ లారెన్స్ సినీ ప్రేక్షకులని భయపెట్టడానికి బాగానే ప్రయత్నించాడు. కొంత వరకు సక్సెస్ అయినప్పటికీ చివరి పార్ట్ వచ్చేసరికి జనాలకి బోర్ కొట్టించేసాడు. ఇపుడు మరో డైరెక్టర్ కూడా ఇదే సిరీస్ సినిమాలతో మన ముందుకు వస్తున్నాడు. తమిళ్ లో ‘అరన్మణి’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాల సిరీస్ తెలుగు లో ‘చంద్రకళ’, ‘కళావతి’ అనే పేర్లతో ఇదివరకే రెండు భాగాలు విడుదలయ్యాయి. ఈ రెండు భాగాలు అంతగా ఆకట్టుకోకపోయిన కూడా ఈ డైరెక్టర్ మరో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.
అరన్మణి 3 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు విడుదల చేసాడు. ఈ సినిమాలో మొదటి రెండు భాగాల్లో ఉన్న ‘ఆండ్రియా జెరెమియా’ తో పాటు డైరెక్టర్ సుందర్. సి కూడా నటిస్తున్నారు. మొదటి పార్ట్ లో ముఖ్య పాత్రలో హన్సిక నటించగా, రెండవ పార్ట్ లో త్రిష నటించింది. ఈ సారి రాశి ఖన్నా నటించనుంది. మరో ముఖ్య పాత్రల్లో ‘ఆర్య’ నటిస్తున్నాడు. యోగిబాబు, మనోబాల, వివేక్, సంపత్ మరిన్ని పాత్రల్లో నటించారు. సీనియర్ నటి మరియు డైరెక్టర్ సుందర్ సి భార్య ఖుష్బూ సమర్పణలో అవ్ని సినిమాస్ బ్యానర్ పై సొంత నిర్మాణంలో ఈ సినిమా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ సుందర్.సి . ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు కొద్దీ రోజుల్లో ప్రకటించనున్నారు.